Jagan Diversion Politics

Jagan Diversion Politics: కూటమి ప్రభుత్వ తీరుకు పెను సవాల్..!

Jagan Diversion Politics: జగన్ పర్యటనలు రాజకీయ కుట్రలో భాగమా? పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ పేరిట రచ్చ ఎందుకు సృష్టించారు? వైసీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే రైతుల పంటను తొక్కి నాశనం చేశారా? పొగాకు బేళ్లపై సిగరెట్లు విసిరేసి అగ్నిప్రమాదం సృష్టించాలని ప్రయత్నించారా? రైతుల్ని పరామర్శించేందుకు 15 వేల మందితో దండయాత్రగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భం నుండి ప్రజల దృష్టిని మళ్లించాలన్నదే జగన్ ప్లానా? అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలూ అందులో భాగమేనా? కూటమి ప్రభుత్వం ఈ కుట్రను గుర్తించిందా? లేదా?

జగన్‌ పొదిలి పర్యటన.. కూటమి ఏడాది పాలన విజయోత్సవాల నుండి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకేనా? అందుకే 15 వేల మందితో ఊరేగారా? కావాలనే రౌడీ మూకలను వెంటేసుకుని వెళ్లారా? కుట్రపూరితంగానే పోలీసులపై, మహిళలపై.. రాళ్లు, చెప్పులు వేయించారా? పొదిలిలో పొగాకు రైతులకు పరామర్శ పేరిట వెళ్లి.. బల ప్రదర్శన చేసి.. జగన్‌ కోసం ఇంత మంది జనం వచ్చారంటే.. కూటమి వైఫల్యమే కారణమని ప్రొజెక్ట్‌ చేయదలుచుకున్నారా? ముందస్తు ప్రిపరేషన్‌తో, ముందుగానే చుట్టుపక్కల జిల్లాల నాయకులకు జనసమీకరణ బాధ్యతలు పురమాయించి, అనుకున్నట్లే పొదిలికి వచ్చి భీభత్సం సృష్టించారా? ఈ జనాలను తరలించే విద్యనే వైసీపీ ఇంకా నమ్ముకుంటోందా? జగన్‌కు జనాధరనణ ఉన్న మాట వాస్తమే అయితే… ఎన్నికల ముందు “సిద్ధం” సభలకు వచ్చిన జనాలంతా ఏమయ్యారు? సిద్ధం సభల్లో పోటెత్తిన జన ప్రభంజనం గ్రాఫిక్స్‌ మాయాజాలమా? లేక ధన బలంతో జనసమీకరణ చేసి ఆర్భాటంగా నిర్వహించిన డ్రామా సభలేనా? పొదిలిలో జరిగింది కూడా అదేనా? జనాలొస్తేనే నేనొస్తా.. లేదంటే ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేస్తా.. ఆ తర్వాత మీ తోలు తీస్తా.. అంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల్ని జగన్‌ హెచ్చిరించింది వాస్తవం కాదా? జగన్‌కు భయపడి.. చచ్చీ చెడి.. ఓ 15 వేల మందిని పొదిలిలో పోగేస్తే… 15 లక్షల మంది వచ్చారన్నంత సీన్‌ క్రియేట్‌ చేస్తూ.. అశేష జనసందోహంలో ఓ భాగం అంటూ.. క్యామెడీ క్యాప్షన్లతో ఫేక్‌ కటింగ్‌లు ఇస్తున్నారా? అసెంబ్లీకి రాకుండా.. స్క్రిప్టెడ్‌ పర్యటనలతో పెద్ద డ్రామా ఆర్టిస్టులా రాష్ట్రమంతా తిరుగుతున్న జగన్‌మోహన్‌రెడ్డి.. పొదిలి పర్యటనలో చేసిన రచ్చ.. కూటమి ఏడాది పాలన విజయవంతం అయ్యిందన్న అక్కసుతోనేనా?

Also Read: Pawan and Lokesh Works: మంత్రులుగా సరే.. ఎమ్మెల్యేలుగా ఎన్ని మార్కులు?

Jagan Diversion Politics: సరిగ్గా కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో.. సాక్షిలో నిర్వహించిన డిబేట్‌ కూడా కుట్రలో భాగమేనా? రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ త్రయం. కేంద్రంలో నరేంద్ర మోడీ బలం‌. పరుగులు పెడుతున్న పోలవరం. తిరిగి ప్రాణం పోసుకున్న అమరావతి. ఆర్థిక ఇబ్బందుల్లోనూ పథకాల అమలు. వెరసి కూటమి ప్రభుత్వానికి ప్రజలు మంచి మార్కులు వేయడం చూసి వైసీపీకి కన్ను కుట్టిందా? అసెంబ్లీకి రాలేక, రాష్ట్ర ప్రజలకు మొహం చూపించలేక, వారానికి ఐదు రోజులు ప్యాలస్‌లో పడుకుంటూ, ఆ మిగిలిన రెండ్రోజులు దొరికిన పది మందిని బలవంతంగా కూర్చోబెట్టుకుని, జగన్‌ 2.0 అంటూ కథలు చెబుతున్న జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రాఫ్‌.. ఏడాదిలో ఒక్క పాయింట్‌ కూడా ఇంప్రూవ్‌ కాలేదన్న బాధ, ఆవేదన, ఆక్రోషం కారణంగా.. అమరావతిపై పడ్డారా? అమరావతి మహిళల్ని తిట్టి.. నషాలానికి ఎక్కిన అహాన్ని చల్లార్చుకున్నారా? “అమరావతి వేశ్యా రాజధాని” అంటూ చేసిన జుగుప్సాకరమై వ్యాఖ్యలు.. చితికి పోతున్న వైసీపీని ఎలా బతికించాలో తెలీక సతమతమవుతున్న జగన్‌ రెడ్డిని సంతోష పరచడానికి చేసినవేనా? ఎన్ని కుట్రలు చేసినా.. దైవ బలం, ప్రజాశీర్వాదం ఉన్న అమరావతి పవిత్రతకు మకిలి అంటించలేక పోయారా? ప్రతిపక్షనేత హోదా ఎలాగో ప్రజలివ్వలేదు. ఏడాదిలో విపక్ష నేతగా కూడా విఫలమైన జగన్‌.. కూటమికి ఎదురుగా వచ్చి ఎదుర్కోలేని జగన్‌.. తన సొంత మీడియాని అడ్డుపెట్టుకుని వెనుక నుండి దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారా? ఈ కుట్రని కూటమి ప్రభుత్వం గ్రహించిందా? అందుకే పక్కా ఆధారాలతో కేసులు నమోదయ్యాయా? సుప్రీంకోర్టు దయతో బెయిల్‌ తెచ్చుకున్న వైసీపీ పాత్రికేయుడు, జగన్‌ పాత్రుడు కొమ్మినేని శ్రీనివాసరావు.. కుట్రలు నిరూపితమైతే.. తిరిగి కటకటాల వెనక్కు వెళ్లక తప్పదా? అసలు ఏం జరిగింది? ఏం జరగబోతోంది? లెట్స్‌.. వెయిట్‌ అండ్‌ సీ.

ALSO READ  Rashmika Mandanna: రష్మికపై గుర్రుగా ఉన్న కర్ణాటక!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *