PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 16, 17 తేదీల్లో కెనడాలో పర్యటించనున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు కననాస్కీస్లో జరగనున్న జీ-7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జీ-7 సమ్మిట్‌కు ప్రధానిగా మోదీ హాజరవడం ఇది ఆరోసారి. ఈసారి కెనడాలో జరిగే సమ్మిట్‌లో జీ-7 దేశాల అధినేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది.
PM Modi: కెనడా దేశానికి వెళ్లక ముందే ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 15, 16 తేదీల్లో సైప్రస్ దేశానికి వెళ్లనున్నారు. ఆ దేశ ప్రెసిడెంట్ నికోస్తోతో ఆయన భేటీ కానున్నారు. ఇరుదేశాల దౌత్య సంబంధాల బలోపేతంపై వారిద్దరూ చర్చించనున్నారు. ఆ తర్వాత 16న ప్రధాని మోదీ నేరుగా కెనడాకు బయలుదేరి వెళ్లనున్నారు.

