Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: మతి పోగొడుతున్న ‘హరిహర వీరమల్లు’ క్లైమాక్స్!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా దర్శకుడు క్రిష్, జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్‌లో మేకర్స్ సినిమా విఎఫ్ఎక్స్ పనులను పూర్తి చేసి, అభిమానులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ పనులు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టీమ్ హామీ ఇస్తోంది.

ఈ సినిమాలో ఏకంగా 6000 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండగా, ప్రతి షాట్‌లో 10 లేయర్స్‌తో అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, కేవలం క్లైమాక్స్ సన్నివేశాల విఎఫ్ఎక్స్ కోసమే 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రేక్షకులకు అత్యద్భుతమైన సినిమాటిక్ అనుభవం అందించేందుకు మేకర్స్ కట్టుబడి ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *