The Raja Saab

The Raja Saab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ రెడీ.. ఫన్ మోడ్‌లో మారుతి, థమన్!

The Raja Saab: పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం అంచనాలను మించేలా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి వరుసగా అప్‌డేట్‌లతో మేకర్స్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్నారు.

జూన్ 16న ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు థమన్ టీజర్‌కు ఫైనల్ టచ్‌లు ఇస్తూ ఫన్ మోడ్‌లో మునిగిపోయారు. టీజర్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ద్వయం, త్వరలో ఈ చిత్రం హీట్ మోడ్‌లోకి వెళ్తుందని హింట్ ఇచ్చారు. మారుతి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ అభిమానులకు ఉత్సాహం నింపాడు.

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌తో ప్రభాస్ మ్యాజిక్ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *