Rain Alert: హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనిలో భాగంగా గురువారం తెల్లవారుజామున (జూన్ 12) భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని అబిడ్స్, పటాన్‌చెరువు, జూబ్లీహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, పంజాగుట్ట, లింగంపల్లి, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది.
Rain Alert: కొంతకాలంగా ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమైంది. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర వేళల్లో టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

