Akhanda 2: నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు! ‘అఖండ 2 – తాండవం’ టీజర్‌తో బాలయ్య మరోసారి తన హవా చూపించాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ రిలీజైన 24 గంటల్లో 24 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఊచకోత కోసింది. అంతేకాదు, 540Kకు పైగా లైక్‌లతో సోషల్ మీడియాలో హోరెత్తించింది. టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌లలో ఐదో స్థానం దక్కించుకుని, సీనియర్ హీరోల్లో బాలయ్య ఓ రేంజ్ రికార్డు సృష్టించాడు.
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య మాస్ జాతర మళ్లీ మొదలైంది. థమన్ సంగీతం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా అదరగొట్టనున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న దసరా స్పెషల్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ టీజర్‌తో హైప్ ఆకాశాన్ని తాకుతోంది. బాక్సాఫీస్‌లో బాలయ్య తాండవం చూసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.