Meghalay Murder Case: ఇండోర్ హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తుంటే హతుడు రాజా రంఘువంశీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లయిన రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది.
Meghalay Murder Case: హనీమూన్ హత్య కేసులో నిందితురాలైన రాజా రఘువంశీ భార్య సోనమ్ తన నేరాన్ని అంగీకరించింది. తన ప్రియుడుతో కలిసి ఈ హత్య చేసినట్టు, ఆ హత్యలో ఆమె కూడా భాగం పంచుకున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు సోనమ్ సహా నిందితులను షిల్లాంగ్ కోర్టులో హాజరుపర్చగా, కోర్టు వారికి 8 రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన దర్యాప్తు వివరాల్లో ఒక్కొక్కటీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
కామాఖ్య ఆలయంలో పూజలయ్యాకే తాకనిస్తానని సోనమ్ షరతు
Meghalay Murder Case: పెళ్లయిన ఆ జంట హాయిగా కాపురం చేయాల్సింది పోయి.. రాక్షసిగా మారిన ఆ నవవధువు నవవరుడికి కండీషన్లు పెట్టింది. హత్యకు ముందు కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు పూర్తిచేశాకే తనను తాకనిస్తానని సోనమ్ తన భర్త అయిన రాజా రఘువంశీకి షరతు విధించింది. అక్కడే హతమార్చాలని భావించి, దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ ప్రాంతంలోని కామాఖ్య ఆలయం వద్దకు తీసుకెళ్లాలని సోనమ్ తన భర్తను బలవంతం పెట్టింది.
బెడిసికొట్టిన ప్లాన్
Meghalay Murder Case: జీవితాంతం కలిసి ఉండాల్సినోళ్లం కదా.. అంతమాత్రం తన భార్య కోరికను రాజా రఘువంశీ కాదనలేకపోయాడు. ఆమె షరతు మేరకు కామాఖ్య ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీంతో దట్టమైన నాంగ్రియాట్ అడవుల్లోకి తన బాయ్‌ఫ్రెండ్ రాజా కుశ్వాహాతో కలిసి తన భర్తను సోనమ్ తీసుకెళ్లింది. అక్కడే తన భర్తను హతమార్చాలని ప్లాన్ చేసింది. అక్కడ పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండటంతో సోనమ్ ప్లాన్ బెడిసి కొట్టింది.
వెయిసావ్రింగ్ జలపాతం వద్దకు మారిన సీన్
Meghalay Murder Case: కామాఖ్య ఆలయం వద్ద ప్లాన్ బెడిసికొట్టడంతో వెయిసావ్రింగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించేందుకు ముందస్తు ప్లాన్ చేసుకున్నది. ఫోన్లలో కిరాయి హంతకులను రప్పించి, జలపాతం వద్ద తన భర్త హత్యకు ప్లాన్ చేసింది. వీరు అక్కడికి వెళ్లగానే కొండచాటున ఉన్న హంతకులు బయటకు రాగానే తన భర్తను వారికి చూపిస్తూ అతన్ని చంపేయండి.. అంటూ సోనమ్ అరిచింది. వారు దారుణంగా హత్య చేస్తుంటే సోనమ్ అక్కడే ఉండి కళ్లారా చూసింది.
మంగళసూత్రమే సోనమ్‌ను పట్టించింది
ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులకు మరో ఆధారం దొరికింది. దీని ఆధారంగా అసలు నిందితురాలు సోనమ్‌యేనని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. సోనమ్, రాజా రఘువంశీ దంపతులు బస చేసిన హోమ్ స్టే గదిలో మేఘాలయ పోలీసులు సోదాలు చేస్తుండగా, ఆ సమయంలో సోనమ్ తాళి దొరికింది. దీంతో పోలీసులు తమ దర్యాప్తును మరో కోణంలోకి తీసుకెళ్లింద. అప్పటిదాకా బయటి వారు హతమార్చినట్టు భావించిన పోలీసులు అసలు నిందితులు భార్య, ఆమె బాయ్ ఫ్రెండేననే కోణంలో దర్యాప్తును చేపట్టి కోర్టులో హాజరుపర్చారు.
నేరం రుజువైతే తన చెల్లిని ఉరితీయండి
Meghalay Murder Case: రాజా రఘువంశీతో సోనమ్‌కు వివాహం చేసుకోవడం ఇష్టంలేదని హత్య అనంతరం జరిగిన విచారణలో వెల్లడైంది. రాజా కుశ్వాహాతో ప్రేమలో ఉన్న ఆమె అతనితోనే జీవితం పంచుకోవాలని, భర్తను హతమార్చాలనే ఈ ప్లాన్ చేసినట్టు తేలింది. ఒకవేళ తన భావను తన చెల్లి సోనమ్ హత్య చేసినట్టు నేరం రుజువైతే తన చెల్లి సోనమ్‌ను ఉరితీయండి అని ఆమె సోదరుడు గోవింద్ పోలీసులను కోరాడు.