Actress Kalpika Ganesh:టాలీవుడ్ నటి కల్పికా గణేశ్‌పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే నెల 29న ప్రిజం పబ్‌లో జరిగిన ఘటనతో ఆమెపై ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బర్త్‌డే కేక్ విషయంపై తనపైనా ప్రిజం పబ్ యాజమాన్యం, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని, డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి చేశారని కల్పిక తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Actress Kalpika Ganesh:తాజాగా ప్రిజం నిర్వాహకుల ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో కల్పికా గణేశ్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సిబ్బంది పట్ల ఆమె అసభ్యంగా ప్రవర్తించిందని, ప్లేట్లు విసిరేయడం, సిబ్బందిపై బాడీ షేమింగ్ చేయడం, దుర్భాషలాడటంపై ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే ఆమె హంగామా చేసిందని వారు ఆరోపించారు.
Actress Kalpika Ganesh:కోర్టు అనుమతితో నటి కల్పికపై వివిధ యాక్ట్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 324(4), 352, 351(2) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఆరేంజ్ సినిమాతో అరంగేట్రం చేసిన కల్పిక వివిధ సినిమాల్లో నటించారు. జులాయి, సారొచ్చారు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచె మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర సినిమాల్లో కల్పిక నటించారు.
