Kannappa

Kannappa: కన్నప్ప సినిమాపై మరో వివాదం – బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగ్రహం

Kannappa: ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కన్నప్ప” సినిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కనిపించిన పిలక మరియు గిలక పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో సమావేశమై నిరసన తెలిపారు. సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్థానిక శివాలయంలో శివలింగానికి అభిషేకం చేసి వినూత్నంగా నిరసన చేపట్టారు. “ఈ సినిమాలో  చేసిన కొన్ని పాత్రలు హిందూ సంప్రదాయాన్ని, బ్రాహ్మణ వర్గాన్ని అవమానపరచే విధంగా ఉన్నాయని” వారు ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Ram Charan-Trivikram: రామ్ చరణ్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ ఇక లేనట్టేనా?

వీరిని ప్రేరేపించిన ముఖ్య కారణం – సినిమాలో పిలక మరియు గిలక అనే పాత్రల మాధ్యమంగా బ్రాహ్మణులను వ్యంగ్యంగా చిత్రించారని వారి అభిప్రాయం. అందువల్ల, ఆ పాత్రలను పూర్తిగా తొలగించాలని వేదిక డిమాండ్ చేసింది.

ఇంతటితో ఆగకుండా, హైకోర్టును ఆశ్రయించిన బ్రాహ్మణ చైతన్య వేదిక, ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు న్యాయపరంగా కూడా చర్యలు ప్రారంభించింది. “వీటిపై స్పందించకపోతే మేము రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం” అని వారు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో “కన్నప్ప” సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. సినిమా విడుదల ముహూర్తం సమీపిస్తున్న వేళ ఈ వివాదం చిత్రం ప్రమోషన్‌కు నెగటివ్ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral Video: మందేసి డ్రైవర్ ఒళ్లో కూచుని డ్రైవింగ్.. కట్ చేస్తే.. ఈ రష్యన్ పిల్ల పోలీసులపై చేసిన అల్లరి చూడండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *