Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, తాజాగా బ్రహ్మానందం, సప్తగిరిల ‘పిలక-గిలక’ పాత్రల పోస్టర్‌పై వివాదం రేగింది. బ్రాహ్మణ సంఘాలు ఈ పాత్రలు తమ జాతిని అవమానిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, మంచు కుటుంబం సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ సంప్రదాయాలను కించపరుస్తోందని ఆరోపించారు. గతంలో ‘దేనికైనా రెడీ’ చిత్రంలోనూ ఇలాంటి వివాదం రేగి, హైకోర్టు ఆదేశాలతో సన్నివేశాలు తొలగించారని గుర్తు చేశారు. ఈ పాత్రలపై స్పష్టత ఇవ్వాలని మోహన్‌బాబు, విష్ణులను డిమాండ్ చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
