Chenab Railway Bridge: జమ్ముకశ్మీర్‌లో నిర్మించిన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా ప్రారంభించారు. ఇదే సమయంలో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. ఇది భారతీయ రైల్వే వ్యవస్థలో కశ్మీర్ లోయను అనుసంధానించే అత్యంత కీలకమైన ప్రాజెక్టు. దీనిలోని చీనాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెన ఇది.
చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన అతి ఎత్తయిన రైల్వే వంతెన ఇది. ఇది ఈపిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తలో ఉంటుంది. ఢిల్లీలోని కుతుబ్మీనార్ కంటే నదీగర్భం నుంచి రైలు స్థాయి వరకు దాదాపు ఐదు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రాయణ సమయాన్ని సుమారు 3 గంటలకు తగ్గిస్తున్నది.
చీనాబ్ వంతెన పొడవు 1,315 మీటర్ల దూరం ఉంటుంది. నదిపై సలాల్ డ్యామ్ సమీపంలో చీనాబ్ నదిపై నిర్మించారు. గరిష్ఠ గాలి వేగం గంటకు 266 కిలోమీటర్ల వరకు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. భూకంప నిరోధకంగా అత్యంత భద్రతా ప్రమాణాలతో దీనిని నిర్మించారు. అధిక గాలి వేగాన్ని, తీవ్రమైన భూకంపాలను ఈ వంతెన తట్టుకొని నిలబడగలుగుతుంది.
ఇది కూడా చదవండి: Lakhpati Didi Yojana: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన అయిన ఈ చీనాబ్ వంతెనను అనేక కంపెనీలు, భారతీయ సంస్థలతో కలిసి నిర్మించాయి. వంతెన రూపకల్పన, నిర్మాణాన్ని వీఎస్ఎల్ ఇండియా చేపట్టగా, దక్షిణ కొరియాకు చెందిన అల్ట్రా కన్స్ట్రక్షన్ మరియు ఇంజినీరింగ్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించారు. దీని పునాది రక్షణ కోసం డిజైన్‌ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు బాధ్యతలు అప్పగించారు. వాలు స్టెబులిటీ విశ్లేషణను ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్ట్ఇట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ పూర్తి చేసింది.
ఈ వంతెన నిర్మాణం భారతదేశం, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, జర్మనీ వంటి దేశాల నిపుణుల సమన్వయంతో పూర్తయింది. దీని నిర్మాణాన్ని బ్లాస్ట్ ఫ్రూఫ్‌గా నిర్మించడంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కూడా చేతులు కలిపింది. ఫిన్లాండ్కు చెందిన డబ్ల్యూఎస్పీ గ్రూప్ వయా డక్ట్, ఫౌండేషన్లను రూపొందించింది. జర్మనీకి చెందిన లియోన్హార్ట్ ఆండ్రా అనే సంస్థ ఆర్చ్‌ను నిర్మించింది.


