Dulquer Salmaan: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించాడు. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన ఈ హీరో, వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంతో భారీ వసూళ్లు రాబట్టాడు. అయితే, ఈ హీరో రెండు భారీ డిజాస్టర్‌ల నుంచి తెలివిగా తప్పించుకున్నాడని టాక్!
Also Read: Fauji: ఫౌజీ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ షూట్!
Dulquer Salmaan: కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్-2’లో సిద్ధార్థ్ పోషించిన రోల్‌కు మొదట దుల్కర్‌నే అనుకున్నారు. కానీ, ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో సిద్ధార్థ్ ఆ పాత్ర చేశాడు. ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే! అదే జోరులో కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’లో శింబు చేసిన పాత్రకు దుల్కర్‌ను సంప్రదించారు. కానీ, ఆ ఆఫర్‌ను ఆయన మరోసారి తిరస్కరించాడు. ఇప్పుడు ఈ చిత్రం కూడా నిరాశపరిచే విమర్శలు అందుకుంటోంది. దీంతో దుల్కర్‌ను అభిమానులు ‘లక్కీ స్టార్’గా పిలుచుకుంటున్నారు!