Gold Rate Today: బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది.ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలు, అమెరికా-చైనా వాణిజ్య సమస్యలు, అంతర్జాతీయ మార్కెట్ల అస్థిరతల వల్ల బంగారం ధరలు ఎప్పుడూ ఊగిసలాడుతూనే ఉన్నాయి.
ఇటీవల రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు, జూన్ 7న స్వల్పంగా తగ్గాయి. కానీ ఇదే తగ్గుదల అనుకునే లోపే, కొనుగోలు సమయంలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కలిపి తులం ధర లక్ష రూపాయలు దాటుతోంది. అంతేకాదు, వెండి ధర కూడా క్రమంగా పెరుగుతోంది.
బంగారం, వెండి ధరల పట్టిక (జూన్ 7, 2025)
నగరం/రాష్ట్రం | 24 క్యారెట్ (10 గ్రా) | 22 క్యారెట్ (10 గ్రా) | వెండి ధర (1 కిలో) |
---|---|---|---|
హైదరాబాద్ | ₹99,590 | ₹91,290 | ₹1,07,000 |
దిల్లీ | ₹99,740 | ₹91,140 | ₹1,07,100 |
ముంబై | ₹99,590 | ₹91,290 | ₹1,06,900 |
చెన్నై | ₹99,590 | ₹91,290 | ₹1,07,000 |
బెంగళూరు | ₹99,590 | ₹91,290 | ₹1,07,050 |
విజయవాడ | ₹99,590 | ₹91,290 | ₹1,07,000 |
కోల్‌కతా | ₹99,600 | ₹91,200 | ₹1,07,000 |
అహ్మదాబాద్ | ₹99,580 | ₹91,280 | ₹1,06,950 |
జైపూర్ | ₹99,620 | ₹91,310 | ₹1,07,100 |
లక్నో | ₹99,630 | ₹91,300 | ₹1,07,000 |
బంగారం కొనుగోలు సూచనలు:
-
బంగారం కొంటే హాల్‌మార్క్ తప్పనిసరి.
-
24 క్యారెట్‌పై “999”, 22 క్యారెట్‌పై “916” కోడ్ ఉంటే, అది నాణ్యతకు నిదర్శనం.
-
ఎక్కువగా అమ్మే బంగారం 22 క్యారెట్, కానీ కొన్ని మోడరన్ డిజైన్లు 18 క్యారెట్లుగా ఉంటాయి (750 హాల్‌మార్క్).
నిపుణుల సూచన:
క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంచనా ప్రకారం, వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. దీన్ని లాభంగా మార్చుకోవాలనుకునేవారు స్టాక్‌పిల్లింగ్‌కు ఇదే సరైన సమయం కావొచ్చు.