Delhi: కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు – అవినీతి ఆరోపణల కేసులో మలుపు

Delhi: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన అవినీతి ఆరోపణల వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

కేటీఆర్ గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ తీవ్రంగా స్పందించారు. ఆమె ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదుతో కేటీఆర్‌పై కేసు నమోదైంది.

తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును పరిశీలించి కేటీఆర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆమె పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ వాదనలు వినిన ధర్మాసనం, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *