Muzammil Ibrahim: దీపికా పదుకొణె గత ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. రణబీర్ కపూర్, యువరాజ్ సింగ్‌లతో ఆమె డేటింగ్ వార్తలు గతంలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లిగా సంతోషంగా ఉన్న దీపికా గత రిలేషన్‌షిప్‌లు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ముజమ్మిల్ ఇబ్రహీం అనే మోడల్, 2000 సంవత్సరం ప్రారంభంలో దీపికాతో తాను రెండేళ్లు డేటింగ్ చేసినట్లు వెల్లడించాడు. అప్పట్లో దీపికా గుర్తింపు లేని మోడల్‌గా ఉండేదని, ముంబైలో రిక్షాలో డేట్స్‌కు వెళ్లేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చాడు. దీపికా నిజాయితీపరురాలని, తమ బ్రేకప్‌కు ఎలాంటి బాధ లేదని కూడా పేర్కొన్నాడు. అయితే, దీపికా తండ్రి ప్రముఖుడైనా, ఆమెకు ఆర్థిక స్థోమత తక్కువేనని, సాధారణ జీవితం గడిపినట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ముజమ్మిల్‌పై విమర్శలు వస్తున్నాయి. పెళ్లైన దీపికా గురించి ఇలా మాట్లాడటం పబ్లిసిటీ స్టంట్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
