Aamir Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిసి ఓ సంచలనాత్మక ప్రాజెక్ట్‌లో జతకడుతున్నారు. ఈ కాంబినేషన్ ఇప్పటికే సినీ ప్రియుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. లోకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’లో అమీర్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు వీరిద్దరూ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇది ఓ సూపర్ హీరో జానర్ చిత్రం కానుందని, అమీర్ ఖాన్ హీరోగా నటిస్తూ లోకేష్ స్టైలిష్ యాక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. వచ్చే ఏడాది రెండో భాగంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని అమీర్ ఇటీవలి ఇంటర్వ్యూలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్, అమీర్ ఖాన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కలిస్తే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద గట్టిగా వసూళ్లు కుమ్మడం ఖాయం. సినీ లవర్స్‌లో ఈ కాంబోపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
