Telangana Congress: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నూతనంగా ఇటీవలే ఎంపికైన మల్లు రవిపై సొంత పార్టీ నుంచే విమర్శల వాడి తీవ్రమవుతున్నది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆయనపై విరుచుకుపడ్డారు. గాంధీభవన్‌లో చిట్‌చాట్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనపై ఏఐసీసీ అధిష్ఠానానికి తాను ఫిర్యాదులు కూడా చేసినట్టు చెప్పారు.
Telangana Congress: నాగర్ కర్నూలు ఎంపీ అయిన మల్లు రవిపై ఇటీవలే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఏకంగా టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. చేసిన పనులపై 10 శాతం మేర కమిషన్ వసూలు చేస్తున్నారని మల్లు రవిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కమిషన్ తీసుకొని పనులు చేసి పెట్టి కాంగ్రెస్‌కు నష్టం చేకూరుస్తున్నాడని ఆరోపించారు.
Telangana Congress: జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మల్లు రవి తీరని నష్టం చేస్తున్నాడని ఆ పార్టీ నేతలు మీనాక్షి నటరాజన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీని, పార్టీ నేతలను అభాసుపాలు చేస్తూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Telangana Congress: ఇదే నేపథ్యంలో సంపత్‌కుమార్ కూడా మల్లు రవిపై విమర్శలు గుప్పించడం గమనార్హం. మల్లు రవికి వయసు ఎక్కువ, చాదస్తమూ ఎక్కువేనని ఎద్దేవా చేశారు. అలంపూర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్‌కు వివరణ ఇచ్చానని చెప్పారు.
Telangana Congress: మల్లు రవి అత్యుత్సాహంతో ఏదో చేయబోయ ఇరుక్కున్నాడని తెలిపారు. ఎంపీ రవి పెండింగ్ బిల్లులను విడుదల చేయడానికి 10 శాతం కమిషన్ తీసుకుంటూ సొంత లాభానికే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎంపీ మల్లు రవిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేశానని సంపత్‌కుమార్ తెలిపారు.