Ravi Teja

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ షో.. మరోసారి ఖిలాడీ బ్యూటీతో జోడీ!

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన ట్రేడ్‌మార్క్ స్పీడ్‌తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ‘మాస్ జాతర’ తర్వాత, దర్శకుడు కిషోర్ తిరుమలతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా, వారిలో ఒకరు రవితేజ సరసన ‘ఖిలాడీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతి అని తెలుస్తోంది. రవితేజతో మరోసారి జోడీ కట్టనున్న డింపుల్, ఈ చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. రవితేజ ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ హీరో ఈసారి ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Weekly Horoscope: ఆ రాశివారికి ఈ వారం విదేశాల్లో ఉద్యోగం వచ్చే ఛాన్స్!..12 రాశుల వారికి వారఫలాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *