Donald Trump

Donald Trump: ట్రంప్ బడ్జెట్ బుల్లెట్‌.. లక్ష్యం అడవి గుర్రాల జీవితం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అడవి గుర్రాల సంక్షేమ నిధుల్లో భారీ కోతలు పెట్టింది. 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో 143 మిలియన్ డాలర్ల నుంచి 100 మిలియన్ డాలర్లకు తగ్గింపు ప్రతిపాదనతో, ట్రంప్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన గుర్రాల వధపై నిషేధాన్ని ఎత్తివేయాలని సంకేతాలు ఇచ్చింది. ఈ నిర్ణయం 64,000 గుర్రాల సామూహిక వధకు దారి తీస్తుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో అడవి గుర్రాలు, గాడిదల సంరక్షణ కోసం బ్యూరో ఆఫ్ లాండ్ మేనేజ్మెంట్ (BLM) బాధ్యత వహిస్తోంది. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 80,000కు పైగా అడవి గుర్రాలు, గాడిదలు ఉన్నాయని అంచనా. అయితే, ఈ సంఖ్య అధికంగా పెరిగి పోవడంతో, BLM వాటి సంరక్షణ కోసం నిధులు కేటాయిస్తోంది. అయితే, ఆరోగ్యకరమైన గుర్రాలను వధించడం, వాటి మాంసం అమ్మడం నిషేధం. 2017లో ఈ నిషేధాన్ని ఎత్తివేసే ప్రయత్నం జరిగినా, ఆందోళనల నేపధ్యంలో ఆ ప్రయత్నం విరమించబడింది.

ప్రస్తుతం, ట్రంప్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన గుర్రాల వధపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు అమెరికన్ వైల్డ్ హార్స్ కన్ జర్వేషన్ సంస్థతో పాటు పలువురు జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు, “అడవి గుర్రాలు, గాడిదల సంతతి పెరుగుతూ ఉంటే, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నా, ట్రంప్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని” ఆక్షేపిస్తున్నారు.

Also Read: Covid-19: దేశంలో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అత్య‌ధికం

Donald Trump: ప్రస్తుతం, ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ మద్దతు ప్రకటించాల్సి ఉంది. అందుకే, జంతు ప్రేమికులు అమెరికన్ కాంగ్రెస్‌కు విన్నవిస్తున్నారు, “గుర్రాల సామూహిక వధకు దారి తీసే చర్యకు మద్దతు ఇవ్వొద్దని”.

ఈ ప్రతిపాదనలు అమల్లోకి రాగానే, 64,000 గుర్రాల వధకు అవకాశం కల్పించబడుతుంది. అందువల్ల, అడవి గుర్రాల సంరక్షణకు సంబంధించిన నిధుల కోతలు, ఆరోగ్యకరమైన గుర్రాల వధపై నిషేధం ఎత్తివేయడం వంటి చర్యలు, జంతు సంక్షేమం పై తీవ్ర ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *