Bengaluru Stampede: బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. నిర్వాహకులపై ఆరా తీసిన పోలీసులు అరెస్టుల పర్వం మొదలుపెట్టారు. ఈ మేరకు ఆర్సీబీ జట్టు మేనేజింగ్ హెడ్ నిఖిల్ సొసలేను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆయనను.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
Bengaluru Stampede: ఈ మేరకు దర్యాప్తు చేపట్టనున్నారు. ఇతర నిర్వాహకుల కోసం విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈవెంట్ నిర్వాహకులైన డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది అయిన కిరణ్, సుమంత్, సునీల్ మాథ్యూలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో వీరిని విచారిస్తున్నారు.
Bengaluru Stampede: ఆర్సీబీ, ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ)లను పోలీసులు తొక్కిసలాట ఘటనలో నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో కేఎస్‌సీఏ కార్యదర్శి, కోశాధికారి పరారీలో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

