Pranav Mohanlal: మలయాళ సినీ పరిశ్రమలో యువ హీరోగా మెరిసిన ప్రణవ్ మోహన్‌లాల్, మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తనయుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత హీరోగా తనదైన గుర్తింపు సంపాదించాడు. ‘హృదయం’ సినిమాతో మలయాళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ‘వర్షంగళ్కు శేషం’ చిత్రంతో మరోసారి తన సత్తా చాటాడు. సినీ రంగంలో అన్ని విభాగాల్లోనూ ముద్ర వేసిన ప్రణవ్, ఇప్పుడు సినిమాలకు దూరంగా సామాన్య జీవితం గడుపుతున్నాడు.
చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్‌పై ఆసక్తి ఉన్న ప్రణవ్, ప్రస్తుతం స్పెయిన్‌లో ఓ ఫామ్‌హౌస్‌లో గొర్రెలు, గుర్రాల కాపరిగా పనిచేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏడేళ్ల కెరీర్‌లో ఐదు సినిమాల్లో నటించిన అతడు, ప్రతి ప్రాజెక్ట్ తర్వాత కొత్త అనుభవాల కోసం ప్రయాణాలు చేస్తుంటాడు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ, కోట్ల ఆస్తులను వదిలేసి సరళ జీవనం ఎంచుకున్న ప్రణవ్, తనదైన మార్గంలో సంతోషంగా ముందుకు సాగుతున్నాడు.