Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం గుంటూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు కలెక్టరేట్ వద్దకు వచ్చిన వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
కలెక్టరేట్ భవనంలోకి అంతా కలిసి వెళ్లే ప్రయత్నం చేసిన వైకాపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ప్రతినిధి బృందానికే అనుమతి ఉన్నదని స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహానికి గురైన అంబటి రాంబాబు అక్కడ ఉన్న సీఐతో ఘాటు మాటల మార్చుకున్నారు. “లోపలికి వెళ్తే ఏం చేస్తావ్?” అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు.
సీఐ కూడా మర్యాదగా సమాధానం ఇస్తూనే, “ఇది నీ రౌడీ రాజ్యం కాదు, అధికారిక ప్రదేశం” అంటూ తేల్చి చెప్పారు. భద్రతా పరంగా నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Ambati Rambabu: ఈ ఘర్షణ సమయంలో అంబటి రాంబాబు ఆగ్రహావేశానికి లోనై, పోలీసులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉద్రిక్తతను మరింత పెంచింది. స్థానికంగా ఈ ఘటనపై ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. పోలీసుల వైఖరిని కొందరు ప్రశంసిస్తుండగా, అంబటి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పళ్లు కొరుకుతున్నావ్ ఏంటిరా బలిసిందా? ఇది నీ రౌడీ రాజ్యం కాదు.. ఈ పోలీస్ ఎవరో కానీ అంబటికి గట్టిగా వాయించాడు..@APPOLICE100 🔥 pic.twitter.com/nnWsWi573K
— Swathi Reddy (@Swathireddytdp) June 4, 2025


