Pakistan Spy Arrested:తవ్వుకున్నాకొద్ది కలుగులోంచి బయటకొస్తున్న ఎలుకల్లాగా పాకిస్థాన్ గూఢచారులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తొలుత గుర్తించని నిఘా వర్గాలు.. ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఒక్కొక్కరి గుట్టు విప్పుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులను భారత్ ఆర్మీ మట్టుబెట్టింది. మూడు రోజులు కొనసాగిన ఆపరేషన్ సిందూర్‌ను ఇరు దేశాల అంగీకరాంతో నిలిపేసింది. అయితే భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
Pakistan Spy Arrested:ఈ పరిస్థితుల్లో భారత్‌లోని ఎందరో పాకిస్థాన్ ఆర్మీ, ఉగ్రవాదులతో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లో మరో పాకిస్థానీ గూఢచారి గగన్‌దీప్ సింగ్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో గగన్‌దీప్ పాకిస్థాన్ ఐఎస్ఐ గూఢచారిగా వ్యవహరించి కీలక సమాచారం ఇచ్చినట్టు గగన్‌దీప్ సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి.
Pakistan Spy Arrested:తర్న్ తరణ్‌లోని మొహల్లారోడ్‌పూర్‌లో గగన్‌దీప్ సింగ్ నివసిస్తున్నాడు. పాకిస్థాన్‌లోని ఖలిస్థానీ టెర్రరిస్టు గోపాల్‌సింగ్ చావ్లాతో పరిచయం ఏర్పడిందని పోలీసులు దర్యాప్తులో తెలిసింది. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో దేశంలోని సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి గగన్‌దీప్ సింగ్ చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు లభించాయని వెల్లడించారు.
Pakistan Spy Arrested:ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు, కొందరు రిటైర్డ్ అధికారులు, ఆర్మీ సిబ్బంది పాకిస్థాన్‌కు గూఢచారులుగా పనిచేసినట్టు గుర్తించిన నిఘా వర్గాలు వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నాయి.


