Thug Life: కమల్ హాసన్ హీరోగా, శింబు, త్రిష, అభిరామి, సాన్య మల్హోత్రా కీలక పాత్రల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం ‘థగ్ లైఫ్’ రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా చుట్టూ వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా కన్నడ రిలీజ్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకుల మనసు నొప్పించడంతో రిలీజ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో కన్నడ రాష్ట్రంలో సినిమా విడుదల అటకెక్కినట్లే కనిపిస్తోంది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, కన్నడ మార్కెట్‌లో రిలీజ్ ఆగిపోవడంతో దాదాపు 15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Also Read: Manchu Vishnu: అస్సలు తగ్గేదేలే అంటున్న విష్ణు?
ఒక వారం తర్వాత అక్కడ విడుదల అవుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మణిరత్నం మార్క్ డైరెక్షన్, రెహమాన్ మ్యాజికల్ ట్యూన్స్ హైలైట్‌గా నిలవనున్నాయి.

