VasamShetty subash: జగన్ కు దమ్ముంటే లోకేష్‌తో డిబేట్‌కు రావాలి

VasamShetty subash: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఆరోపణలు, విమర్శలు తీవ్రమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడిగా జగన్‌ను అభివర్ణిస్తూ, “జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఓ డిబేట్‌కు రావాలి” అని సవాల్ విసిరారు.

వైసీపీ పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్‌నే నమ్ముకుంటోందని విమర్శించారు. “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ పాలిటిక్స్ వెన్నుతో పెట్టిన విద్య. నిజాలు చెబితే భయపడే నేత జగన్” అంటూ విమర్శలు గుప్పించారు.

సుభాష్‌ ఆరోపణల ప్రకారం, ఇటీవల తెనాలిలో గంజాయి ముఠాలకు మద్దతుగా జగన్ వెళ్లారు అని ఆరోపించారు. నేర సంబంధాలున్నవారికి సంఘీభావం తెలిపే నేతగా ప్రజల ముందుకు వస్తున్న జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కామెడీ క్యారెక్టర్‌లా చూస్తున్నారని తేల్చేశారు.

అలాగే, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీల్లో 70 శాతం మేరకు అమలు చేసి చూపిందని మంత్రి వెల్లడించారు. “మేము మాట ఇచ్చిన దాంట్లో ఎక్కువ శాతం పూర్తిచేశాం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం,” అని ఆయన హామీ ఇచ్చారు.

ఇలాంటి రాజకీయ విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  The Rajasaab: ‘ది రాజా సాబ్’ ఫీవర్: ప్రభాస్ హై-వోల్టేజ్ డబ్బింగ్ స్టార్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *