Earthquake

Earthquake: టర్కీ సరిహద్దులో భూకంపం కలకలం – 6.2 తీవ్రత, అధికారులు అప్రమత్తం

Earthquake: టర్కీ-గ్రీస్ మధ్య ఉన్న డోడెకానీస్ దీవుల సమీపంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. ఈ ప్రకంపనలు స్థానికంగా ఉన్న ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.

ఈ ఘటన రాత్రి 11:17 (UTC) సమయానికి నమోదైంది. గ్రీస్‌లోని రోడ్స్ పట్టణానికి దక్షిణంగా సుమారు 18 కిలోమీటర్ల దూరంలో, 42 మైళ్ల (68 కిలోమీటర్ల) లోతులో భూకంప కేంద్రం ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.

ఈ ప్రకంపనలు దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ, ఏజియన్ సముద్ర తీర ప్రాంతాల వరకూ గుర్తించబడ్డాయి. భూకంప సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

Also Read: Smallest Country: ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఇదే

ప్రభుత్వ అధికారులు, అత్యవసర విభాగాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. భవిష్యత్తులో అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశముండటంతో, అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని స్థానిక అధికారులు ప్రజలకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maha Kumbh 2025: పుణ్య స్నానం కోసం నీచత్వం.. మహా కుంభ్‌కు వెళ్ళడానికి తల్లిని ఒంటరిగా ఇంట్లోనే బంధించాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *