Rajahmundry: రాజమండ్రిలో రాజకీయ కలకలం. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రధాన అనుచరుడు చెల్లుబోయిన కృష్ణపై మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
వివరాల ప్రకారం, 2023 నుండి వైసిపి పార్టీ కార్యకర్తగా ఉన్న సుశీల అనే మహిళను చెల్లుబోయిన కృష్ణ మానసికంగా, లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి చిత్రహింసలకు గురి చేసినట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మాజీ ఎంపీ భరత్‌కు తెలియజేసినప్పటికీ, ఆయన చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరింత Going Deep: సుశీల తెలిపిన మేరకు, “కృష్ణ మా కుటుంబ సభ్యుడు… చర్యలు తీసుకోలేను” అంటూ భరత్ సమాధానం ఇచ్చారని, పైగా “కేసు వెనక్కి తీసుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను” అంటూ బెదిరింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. 2023లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటాన్ని విమర్శిస్తున్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఎంపీ భరత్‌పై తీవ్ర ఆరోపణలు చేసారు బాధితురాలు.
Also Read: Nara lokesh: ఉర్సా కంపెనీపై జగన్‌కు లోకేష్ సవాల్
Rajahmundry: ఇక వేధింపులు తట్టుకోలేక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసును కలిసిన బాధితురాలు సుశీలకు ఎమ్మెల్యే ఆర్తి రెడ్డి మద్దతు ప్రకటించారు. బాధిత మహిళకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రస్తుతం సుశీల రాజమండ్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నాయి.