Gold Theft Case:మనుషులు అందం కోసం తయారు చేయించుకున్న బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కుప్పవుతున్నాయి. కుటుంబ అవసరాలు, బంగారం విలువ పెరగడంతో తాకట్టు పెట్టి ఎందరో రుణాలు తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వడ్డీ, వాయిదాల చెల్లింపులతో ఎందరో ఇట్టే బంగారం తాకట్టు పెట్టేస్తున్నారు. దీంతో అన్నిరకాల బ్యాంకుల్లో బంగారం మూలుగుతున్నది. అది సురక్షితంగా ఉంటుందా? అంటే దొంగల కళ్లు పడకుంటా ఉంటాయా? ఇక్కడ ఓ బ్యాంకుపై కొందరు దొంగల కళ్లు పడి ఏకంగా దోపిడీ జరిగింది.
Gold Theft Case:కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర (డీ) మంగోలి పట్టణంలోని కెనరా బ్యాంకులో దొంగలు పడి బంగారాన్ని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ప్రజలు తాకట్టు పెట్టిన 59 కిలోల బంగారం చోరీ జరిగిందని వెలుగులోకి వచ్చింది. ఇది జరిగి వారం రోజులు కావస్తుండటంతో బ్యాంకు సిబ్బంది ఆందోళనలో ఉండగా, తాకట్టు పెట్టిన వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
Gold Theft Case:గత మే నెల 24, 25 తేదీల్లో బ్యాంకుకు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు 23వ తే దీన సాయంత్రం బ్యాంకుకు తాళం వేసి సిబ్బంది వెళ్లారు. 26వ తేదీన ఉదయం గుమస్తా వెళ్లగా షట్టర్ తాళం కట్ చేసి ఉన్నది. ఈ మేరకు బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. 26వ తేదీన బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 8 బృందాలుగా వెళ్లి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.