Vidya Balan: విద్యా బాలన్.. ఈ పేరు సినీ ప్రియులకు బాగా సుపరిచితం. డర్టీ పిక్చర్ మూవీతో యూత్ హృదయాలు గెలుచుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ, ఎన్టీఆర్ బయోపిక్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ‘జటాధర’లో నటిస్తూ, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జోడీ కడుతుందనే రూమర్స్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది.
కెరీర్‌లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆమె ముక్కుసూటి స్వభావం మాత్రం మారలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సినిమా జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. “సినీ రంగంలో మార్పు తప్పదు. పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వాలి.
Also Read: Megastar-Anil: నార్త్ ఇండియాలో మెగాస్టార్ అనిల్ రావిపూడి మాస్ జాతర!
ముఖ్యంగా హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్టు సర్దుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలం. చిన్నప్పుడు నేను చాలా చిలిపిగా ఉండేదాన్ని. రాత్రిళ్లు మేల్కొని అల్లరి చేసేదాన్ని. ఆ అలవాటు మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. సినిమాలు నా జీవితాన్ని మలిచాయి. వివాహం తర్వాత కూడా నటిస్తూ, సినిమాలతో నా ప్రయాణం కొనసాగించడం సంతోషంగా ఉంది” అని విద్యా చెప్పుకొచ్చింది.

