Horoscope

Horoscope: నేటి రాశిఫలాలు: ఆర్థిక లాభాలు, వృత్తిలో పురోగతి, కుటుంబ శాంతి.

Horoscope: ఈ రోజు,మే 30 శుక్రవారం రోజున 12 రాశులకూ వివిధ రంగాల్లో అనుకూల పరిణామాలు కనిపించే సూచనలు ఉన్నాయి. ప్రతి రాశికీ ప్రత్యేకంగా అనుకూలతలు, అవకాశాలు, సవాళ్లు ఉన్నాయి. ఈ రోజు గ్రహాల అనుకూలత వల్ల అనేక రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోవడం వంటి సూచనలు ఉన్నాయి.

మేష రాశి
ఈ రోజు మీ ఆలోచనలు, ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక ఒత్తిడులు తగ్గుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.

వృషభ రాశి
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆధికారుల నుంచి సహాయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

మిథున రాశి
ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. బకాయిలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది.

కర్కాటక రాశి
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు బిజీగా ఉంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. ఆదాయం మార్గాలు పురోగమిస్తాయి.

సింహ రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టడం మంచిది.

కన్య రాశి
రోజంతా సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

తుల రాశి
అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Also Read: Heart Diseases: తస్మాత్ జాగ్రత్త.. వీటివళ్లే గుండెజబ్బులు

వృశ్చిక రాశి
ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు రాశి
ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు బిజీగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.

మకర రాశి
ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు స్థిరంగా ఉంటాయి. విదేశాల్లో శుభ వార్తలు అందుతాయి.

కుంభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది. ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీనం రాశి
వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు వినే అవకాశం ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *