Hyderabad

Hyderabad: గుమిగూడితే ఇక అంతే… హైదరాబాదులో నెలరోజుల పాటు 144 సెక్షన్..

Hyderabad: హైదరాబాదులో కఠిన నిబంధనలు అమలు చేశారు పోలీసులు.నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్(cv anand) వెల్లడించారు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల సమావేశం, ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపారు. హైదరాబాద్‌లో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు.

Also Read: Hyderabad: గుమ్మి కూడితే ఇక అంతే… హైదరాబాదులో నెలరోజుల పాటు 144 సెక్షన్..

Hyderabad: కాగా, నగరంలో 144 సెక్షన్ గత సంవత్సరం విధించారు. అయితే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు, ధర్నాలకు మాత్రం అనుమతి ఉంటుందని ఆ ఉత్తర్వు పేర్కొంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అంతటా నిరసన ప్రదర్శనలను నిషేధించినట్టు తెలిపింది.

144 సెక్షన్ అంటే ఏంటి..?

Hyderabad: 144 సెక్షన్ అమల్లో ఉంటే బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించడం నిషేధం. ఎలాంటి ప్లకార్డులు, జెండాలను ప్రదర్శించడానికీ పోలీసులు అనుమతి ఇవ్వరు. అయిదుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి ఉండకూడదు. ధర్నాలను లోయర్ ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆందోళనలను నిర్వహించడానికి అనుమతి లేదు.

ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో తరచూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ వస్తోన్నందున నగర పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *