x : శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ‘X’ (మాజీ Twitter) సేవలు ఆకస్మికంగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా అనేకమంది యూజర్లు X యాప్ మరియు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే “Something went wrong, please try again” అనే సందేశం కనిపించిందని వారు పేర్కొన్నారు. పేజీ రీలోడ్ చేయడానికి “Retry” బటన్ మాత్రమే చూపించిందని పలువురు ఫిర్యాదులు చేశారు.
ఈ సాంకేతిక లోపం దాదాపు అరగంట పాటు కొనసాగినట్టు వినియోగదారులు తెలిపారు. ఈ సమయంలో, వారి అనుభవాలను ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంటూ ‘X’ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ‘X’ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇది సర్వర్ లోపమా, లేక ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చిందా అన్న విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఇతివరకు కూడా ఇలాంటి సేవా అంతరాయాలు ‘X’ లో నమోదయ్యిన సందర్భాలు ఉన్నప్పటికీ, ప్రతి సారి కంపెనీ స్పందన ఆలస్యం కావడంపై వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

