Ram Charan: దర్శకుడు శంకర్ సినిమాలు ఖర్చుతో కూడిన విజువల్ వండర్స్ అని అందరికీ తెలిసిందే. అయితే, ఆయన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బడ్జెట్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం శంకర్ ఏకంగా ఏడున్నర గంటల ఫుటేజ్‌ను చిత్రీకరించారని, దీన్ని ఎడిటింగ్‌లో మూడు గంటలకు కుదించారని మాజీ ఎడిటర్ షమీర్ మహమ్మద్ వెల్లడించారు. షమీర్ వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, మరో ఎడిటర్ ఈ ఫుటేజ్‌ను మరింత ట్రిమ్ చేశారు. దాదాపు నాలుగున్నర గంటల ఫుటేజ్ ఎడిటింగ్‌లో కత్తిరించబడింది. ఈ విషయం సినిమా బృందంలోని కొందరు సభ్యులు కూడా ధృవీకరించారు, వారి సన్నివేశాలు ఎడిటింగ్‌లో తొలగించబడ్డాయని పేర్కొన్నారు. మొత్తానికి ఈ భారీ ఫుటేజ్ తీయడానికి నిర్మాత దిల్ రాజు ఖర్చు చేసిన బడ్జెట్ ఊహించనంత ఎక్కువగా అయిందని స్పష్టం అవుతుంది.
#Gamechanger original length cut Seven and half hours – Editor #ShameerMohammad !!#RamCharan #Shankar pic.twitter.com/oVyOYxY2SS
— Telugu Chitraalu (@TeluguChitraalu) May 24, 2025