Tollywood

Tollywood: థియేటర్ల బంద్ ఉండదు.. కానీ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఎలా?

Tollywood: ఈరోజు హైదరాబాదులోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఒకే టేబుల్‌పై సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్ల బంద్‌కు తాత్కాలిక బ్రేక్ పడిందని అధికారికంగా స్పష్టం చేస్తూ, జూన్ 1 నుంచి బంద్ ఉండదని ప్రకటించారు.

వివాదానికి తెర

పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్లు గట్టి పట్టుదలతో ఉన్నప్పటికీ, చర్చలతో కొన్ని మార్గాలు తెరుచుకున్నాయి. బంద్‌కు పిలుపు ఇచ్చిన ఎగ్జిబిటర్లతో తాత్కాలిక రాజీ కుదిరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాతలు కొన్ని కీలక అంశాలను టేబుల్ మీద పెట్టారు.

సమావేశ హైలైట్స్: పరిశ్రమలో మార్పులకు నాంది

  • టికెట్ ధరలు: టికెట్ రేట్లపై పెద్దగా చర్చలు లేకపోయినా, థియేటర్లలో చిరుతిళ్లు, తినుబండారాల ధరలను తగ్గించాలనే వాదన బలంగా వినిపించింది. “పార్కింగ్ ఫీజు లేకుండా చేస్తే, కుటుంబ ప్రేక్షకులు మరింతగా థియేటర్లకు వచ్చేందుకు ఉత్సాహపడతారు” అని పలువురు అభిప్రాయపడ్డారు.

  • రీ-రిసల్స్: చిన్న సినిమాల విడుదలకు ఇబ్బందులు కలిగించేలా రీ-రిసల్స్ జరగకుండా చూడాలని సూచించారు. “సినిమాలు లేనప్పుడు మాత్రమే రీ-రిసల్స్‌కి అవకాశం ఇవ్వాలి” అని తేల్చారు.

  • స్టార్స్ పాల్గొనాలి: స్టార్ హీరోలు కనీసం సంవత్సరానికి ఒక సినిమా చేయాలని నిర్మాతలు అభ్యర్థించారు. హీరోలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వివరించనున్నట్లు తెలుస్తోంది.

  • ఓటీటీ, పైరసీ సమస్యలు: పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక మెకానిజం అవసరమని, ఐబొమ్మ వంటి సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటీటీ సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఫిల్మ్ ఛాంబర్‌ దృష్టి పెట్టనుంది.

  • పారితోషికాల తగ్గింపు: చిత్ర బడ్జెట్‌లో నిర్మాతలపై భారం తగ్గించాలంటే, హీరోలు తమ పారితోషికాలను తగ్గించుకోవాలని సూచించారు. సినిమా లాభాల్లో వాటా ఇవ్వడం తర్వాత చూడవచ్చని తెలిపారు.

కొత్త కమిటీ వర్షన్

చర్చల అనంతరం నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుండి ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట టైం ఫ్రేమ్‌తో పనిచేయనుంది. కమిటీ సభ్యుల ఎంపికను మే 30న జరగనున్న ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) మీటింగ్‌లో తేల్చనున్నారు.

ఇది కూడా చదవండి: War-2: ‘వార్-2’ టీజర్‌పై హైప్‌తో పాటు వివాదం.. మేకర్స్ సీరియస్ డెసిషన్?

థియేటర్ల బంద్ ప్రచారంపై క్లారిటీ

ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, “థియేటర్ల బంద్‌పై కొనసాగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు. పరిశ్రమ సమస్యలను మేమే పరిష్కరిస్తాం. బాహ్యవ్యక్తుల జోక్యం అవసరం లేదు” అని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *