Avatar 2

Avatar 2: అవతార్ 2 రీ-రిలీజ్.. థియేటర్లలో మరోసారి విజువల్ మాయాజాలం!

Avatar 2: హాలీవుడ్ సంచలన ఫ్రాంచైజ్ ‘అవతార్’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ అద్భుతాలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. అందులో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రెండో భాగం కూడా గతంలో విడుదలై సంచలన విజయం సాధించింది.

తాజాగా, ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ రీ-రిలీజ్ కేవలం ఒక వారం పాటు పరిమిత థియేటర్లలోనే అందుబాటులో ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి ఈ విజువల్ వండర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Spirit: స్పిరిట్ సినిమాలో సంచలన మార్పు.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?

సినిమా ప్రియులకు ఈ వార్త ఓ గ్రాండ్ ట్రీట్‌గా చెప్పవచ్చు. అయితే, ఈ రీ-రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందా లేక విదేశీ మార్కెట్లకు మాత్రమే పరిమితమవుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి అవతార్ అభిమానులకు థియేటర్లలో మరోసారి పండోరా ప్రపంచాన్ని ఆస్వాదించే అవకాశం లభించనుంది!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Khaleja: ఖలేజా రీరిలీజ్ షాక్.. ఫ్యాన్స్‌కు ఊహించని ట్విస్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *