Suresh Wife-Anil Wife: సినిమాలు చూపిస్త అంటున్నారు జగన్ మామయ్య. రెడ్‌బుక్కో, గిడ్‌బుక్కో.. ఏ బుక్కులో రాసుకున్నా పర్లేదు.. మీ జోలికిస్తే పేర్లు రాయండి.. వాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి సినిమా చూపించే బాధ్యత నాది అంటున్నారు. దానికి జగన్ 2.0 అని పేరు పెట్టుకున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు, అధికారులు జగన్ చూపిస్తానంటున్న సినిమాలు చూడాలంటే.. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి. కానీ వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీనే నమ్ముకున్నోళ్లు అందాకా ఆగక్కర్లేదు. ఎందుకంటే వారికి ఆల్రెడీ భ్రమయుగం లాంటి సినిమా చూపిస్తున్నారు జగన్మోహన్‌రెడ్డి. ఆ భ్రమల్లో ఉండటం వల్లేనేమో బహుషా.. కొందరు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే చరిత్రలో లేనంత వ్యతిరేకత వచ్చేసిందని మాట్లాడుతున్నారు. అంబటి లాంటి నేతలైతే.. ‘జగన్‌ని అరెస్ట్ చేస్తే చేస్కోండి.. ఆయనకేమైనా జైలు కొత్తా.. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు.. కావాలంటే మరో ఆర్నెల్లు జైలుకెళ్తారు.. తిరిగొచ్చి ఎంచక్కా సీఎం అవుతారు’ అంటూ తేల్చేస్తున్నారు.
వైసీపీలో ఇంకొందరి పరిస్థితి అయితే మరీ విచిత్రంగా ఉంటోంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబిలత వ్యవహారం అందుకో ఉదాహరణ. ఎంపీగా ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇస్తే.. ఎన్నో రాచకార్యాలు వెలగబెట్టిన తన భర్త.. అంతటి హోదా నుండి అమాంతం కింద పడిపోయి.. చివరికి జైలు పక్షిగా మారాడన్న బాధని కూడా మర్చిపోయి.. జగన్ చూపిస్తున్న సినిమాలో.. తానే హోం మినిస్టర్ అంటూ కలలు కంటున్నారు నందిగం సురేష్ భార్య బేబిలత. అమరావతిలో అరటి తోటలకు నిప్పు పెట్టి, జగన్ కంట్లో పడి, ఏకంగా ఎంపీ అయిపోయి, ఇప్పుడు మాజీ ఎంపీ అయిన నందిగం సురేష్‌కు భవిష్యత్తులో ఆయన భార్యే పోటీ వచ్చేట్లున్నారు.
నందిగం సురేష్‌పై అక్షరాలా డజను కేసులున్నాయ్. వాటిలో ఒకటి హత్య కేసు. మొన్నటి దాకా జైల్లోనే ఉన్న నందిగం సురేష్ ఇటీవలే బెయిల్‌పై బయటికొచ్చారు. వచ్చీ రాగానే.. ఓ టీడీపీ కార్యకర్తపై దాడి చేశారు. హత్యాయత్నం కేసు నమోదవడంతో మళ్లీ జైలు కెళ్లాడు. ఆయన భార్య బేబిలత గారేమో జగన్ సినీమ్యాటిక్ ప్రపంచంలో విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనీ, ఎమ్మెల్యేగా గెలిచాక.. హోం మినిస్టర్‌ని చేస్తాడనీ, స్టేట్ అంతా ఇదే చెప్పుకుంటున్నారనీ మురిసిపోతున్నారు. ఎంపీగా పనిచేసిన భర్త, పనికిమాలిన పనుల్లో చీటికీ మాటికీ జైలుకెళ్తుంటే… ఏ మాత్రం చింతించని భార్య… హోం మినిస్ట్రీ ఊహల్లో విహరించేలా చేయడం అంటే.. జగన్ చూపిస్తున్న సినిమా ఎఫెక్ట్ మామూలుగా లేదనమాట.
Also Read: Tuda Dollars Diwakar: ‘తుడా’ గేమ్‌ఛేంజర్ డాలర్స్ దివాకర్ రెడ్డి..!
Suresh Wife-Anil Wife: ఇక గత ఐదేళ్లు జగన్ తీసిన సినిమాలో కీ రోల్స్ పోషించిన వాళ్లందరూ జైలు పడుతున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, లిక్కర్ వాసుదేవరెడ్డి, గనుల వెంకట్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ డీఫ్యాక్టో సీఎం ధనుంజయ్‌రెడ్డి, ఐపీఎస్‌లు విశాల్ గున్నీ, క్రాంతి రాణా టాటా లాంటి అధికారుల నుండి, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్ లాంటి నేతల వరకూ.. అందరూ ఆల్రెడీ జగన్ సినిమాలో పాత్రధారులే. ఈ లిస్ట్‌లో ఉన్న మరో ఘనుడు బోరుగడ్డ అనిల్ కుమార్. అడ్డమైన పనులు చేసి క్యాస్ట్ కార్డు వాడటంలో ఈయన కూడా దిట్టే. ఏదో నందిగం సురేష్ పంట పండి ఎంపీ అయ్యారు కానీ, ఆ సమయంలో బోరుగడ్డ అనిల్ కనుక జగన్ కళ్లలో పడుంటే.. జగన్ అతన్ని ఏ స్థాయిలో ఉంచేవాడో ఊహించడం కూడా కష్టం.
అరాచకవాదులకి జగన్ ఇచ్చే ప్రోత్సాహం అలాంటిది మరి. జగన్ కోసం బోరుగడ్డ అనిల్ కూడా జైలు పాలయ్యారు. బయటకు రావడానికి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టారు. ఇప్పటికీ బయటకు రాలేదు. ఇప్పట్లో వస్తాడో రాడో కూడా అనుమానమే. బోరుగడ్డ అనిల్ సతీమణి కూడా.. బోరుగడ్డని అరెస్ట్ చేసిన సందర్భంలో.. దళితులం కాబట్టే మమ్మల్ని వేధిస్తున్నారనీ, తన భర్త ఏ పాపం తెలీని అమాయకుడనీ స్టేట్‌మెంట్ ఇచ్చి ఎపిసోడ్‌ని రక్తి కట్టించారు. మరి నందిగం సురేష్ సతీమణికే హోం మంత్రి పదవి ఇస్తే.. బోరుగడ్డ అనిల్ సతీమణికి జగనన్న మినిమం డిప్యూటీ సీఎం ఇస్తాడేమోనంటూ వైసీపీలో చర్చించుకుంటున్న పరిస్థితి.
జగన్ అనుకుంటున్నట్లు కూటమికి సినిమా చూపించాలంటే.. ఆయన ముందు అధికారంలోకి రావాలి. ఆ దిశగా కరెక్ట్‌గా కృషి చేస్తున్నారో లేదో కానీ, ”జగన్ 2.0” అంటూ సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు ‘అధికారం కమింగ్‌సూన్’ అనే సినిమా చూపిస్తూ, భ్రమల్లో మునిగి, ఊహల్లో తేలేలా చేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు పరిశీలకులు.