Rohit Sharma: రోహిత్ శర్మ సడెన్‌గా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఇదే బాటలో విరాట్ కోహ్లీ సైతం రిటైర్మెంట్ బాట పట్టాడు. అయితే రోహిత్ ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాలని ఉందంటూ గతంలో పలుసార్లు తన మనసులో మాట చెప్పాడు. ఇటువంటి తరుణంలో రోహిత్ ప్రకటనకు కారణమేంటీ..? బీసీసీఐ ఒత్తిడి వల్లే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా కనిపించిన ధోని, సిరీస్ మధ్యలో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో తన రిటైర్మెంట్ ప్రకటిస్తానని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలిపాడు. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మధ్యలో చివరి మ్యాచ్‌ను ప్రకటించాలని ప్లాన్ చేసుకున్నాడు. అందువల్ల ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అతను కోరాడు.
బీసీసీఐ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. బీసీసీఐ తీరుతోనే రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సలహా ఇచ్చింది. అయితే రోహిత్ మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. మరో ఛాన్స్ పట్టుబట్టాడు. అయితే పేలవమైన ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎలాంటి ఆసక్తి చూపలేదు. అలాగే ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌తో కొత్త శకానికి నాంది పలకాలని బీసీసీఐ భావించింది. ఇప్పుడు రోహిత్ నిర్ణయంతో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్ నాయకత్వం వహించడం ఖాయం. ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

