Blood Donation

Blood Donation: రక్తదానం చేశాక శరీరంలో రక్తం ఉత్పత్తి కావడానికి ఎంత సమయం పడుతుంది?

Blood Donation: కొంతమంది అవసరం ఉన్నవారికి రక్తదానం చేస్తారు. రక్తదానం చేస్తే శరీరానికి మంచిది కాదని కొందరు చెబుతుంటే, మరికొందరు అది మంచిదని అంటున్నారు. కానీ ఏది ఏమైనా ఎవరి ప్రాణాన్నైనా కాపాడితే అది ఒక పుణ్యమే కదా! అయితే రక్తదానం చేసిన తర్వాత శరీరంలో అంతే మొత్తంలో రక్తాన్ని ఉత్పత్తి కావడానికి ఎంత సమయం పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్టాన్‌ఫోర్డ్ బ్లడ్ సెంటర్ నివేదిక ప్రకారం, రక్తదానం చేసిన తర్వాత, శరీరం వెంటనే ఎర్ర రక్త కణాలను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. కొన్ని రక్త భాగాలు కొన్ని గంటలు లేదా రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటాయి, మరికొన్ని పునర్నిర్మించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఏ అంశాలు ఎంత సమయం తీసుకుంటాయో తెలుసుకుందాం.

ప్లాస్మా: రక్తదానం చేసిన 24 నుండి 48 గంటల్లోనే శరీరం ప్లాస్మాను పునరుత్పత్తి చేస్తుంది. ఎర్ర రక్త కణాలు పూర్తిగా భర్తీ కావడానికి సాధారణంగా 4 నుండి 8 వారాలు పడుతుంది.

ఇనుము స్థాయిలు: రక్తంలో ఇనుము స్థాయిలు సాధారణ స్థితికి రావడానికి 8 వారాల వరకు పట్టవచ్చు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: శరీరంలో అధిక స్థాయిలో ఇనుము ఉండటం వల్ల కాలేయం, పెద్దప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల ఇనుము లోపం తగ్గుతుంది. రక్తదానానికి, క్యాన్సర్ నివారణకు సంబంధం ఉంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన సంతృప్తి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చాలా మంది దాతలు ఆత్మ సంతృప్తిని అనుభవిస్తారు. ఇది మంచి మానసిక స్థితిని పెంచుతుంది. రక్తదానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *