Joe Biden

Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్​కు క్యాన్సర్..స్పందించిన ట్రంప్

Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం గంభీరంగా మారింది. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో ఆయనకు “అగ్రెసివ్ ప్రోస్టేట్ క్యాన్సర్” ఉందని నిర్ధారణ అయింది. ఈ విషయం స్వయంగా బైడెన్ కార్యాలయం అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. గ్లీసన్ స్కోర్ 9తో ఉన్న ఈ క్యాన్సర్ ప్రమాదకరమైనదిగా వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఇప్పటికే ఆయన ఎముకలకు వ్యాపించింది.

బైడెన్‌కు ఇటీవల మూత్ర సంబంధిత సమస్యలు తీవ్రమవడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాల ప్రకారం ఆయనకు ఉన్న క్యాన్సర్ హోర్మోన్ సెన్సిటివ్‌గా గుర్తించారు. అంటే, మందులు, హోర్మోన్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని మార్గాల్లో నివారించే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తదుపరి మెరుగైన చికిత్సపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

రాజకీయ నాయకుల స్పందనలు

ఈ వార్తపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందించారు. బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై విచారం వ్యక్తం చేసిన ట్రంప్, “ఈ వార్త మమ్మల్ని కలచివేసింది. బైడెన్ త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం,” అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కమలా హారిస్ సైతం బైడెన్‌కు మద్దతుగా ట్వీట్ చేస్తూ, “ఇలాంటి క్లిష్ట సమయంలో బైడెన్ కుటుంబానికి మేము అండగా ఉన్నాం,” అని తెలిపారు.

గత అనుభవం – కుటుంబంలోని క్యాన్సర్ ట్రాజెడీ

జో బైడెన్ కుటుంబానికి ఇది కొత్త కాదు. ఆయన కుమారుడు బియూ బైడెన్ 2015లో బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా మరణించారు. ఇప్పుడు బైడెన్‌కు స్టేజీ 9 ప్రోస్టేట్ క్యాన్సర్ అనే విషయముతో కుటుంబం మళ్లీ విషాదంలో మునిగిపోయింది. సాధారణంగా గ్లీసన్ స్కోరు 5 దాటితే పరిస్థితి తీవ్రంగా పరిగణిస్తారు. కానీ బైడెన్‌కు 9గా ఉండడం ఆందోళనకరం.

ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి?

ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మగవారిలో కనిపించే సాధారణ క్యాన్సర్లలో ఒకటి. అమెరికాలో ప్రతి 8 మందిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సకు బాగా స్పందిస్తుంది. కానీ ఒకసారి ఎముకల వరకు వ్యాప్తి చెందితే, చికిత్స కష్టతరమవుతుంది.

రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం

2024 అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశంతో ఉన్న బైడెన్, గతంలో జరిగిన డిబేట్‌లో తన ఆరోగ్య పరిమితుల వల్ల వెనకడుగు వేశారు. ఆ అనంతరంగా కమలా హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి, ట్రంప్ చేతిలో ఓటమి పాలయ్యారు. తాజా ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో బైడెన్ మరింతగా రాజకీయంగా విరామం తీసుకునే అవకాశమున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *