PM Modi:

PM Modi: హైద‌రాబాద్‌ పాత‌బ‌స్తీ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని తీవ్ర దిగ్భ్రాంతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

PM Modi: హైద‌రాబాద్ చార్మినార్ స‌మీపంలోని గుల్జార్‌హౌస్ వ‌ద్ద జ‌రిగిన అగ్నిప్ర‌మాదం ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తంచేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లచి వేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఈ మేర‌కు మృతులకు సంతాపం, వారి కుటుంబాల‌కు సానుభూతిని వ్య‌క్తంచేశారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

PM Modi: ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మృతుల కుటుంబాలు, క్ష‌త‌గాత్రుల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించారు. పాత‌బ‌స్తీ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌ మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. అదే విధంగా గాయ‌ప‌డిన వారికి రూ.50,000 చొప్పున అంద‌జేస్తామ‌ని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *