Mani Ratnam: మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ తీస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రంలో శింబు, త్రిష, జోజుజార్జ్, గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కమల్ హాసన్ వర్క్ పూర్తి చేసినట్లు ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నవంబర్ మొదటి వారంలో ఓ పాటను చిత్రీకరించనున్నారు మణిరత్నం.
ఇది కూడా చదవండి: Jani Master: 37 రోజుల్లో..: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్
Mani Ratnam: ఈ రొమాంటిక్ సాంగ్ లో శిలంబరసన్, త్రిష నటించనున్నారు. ఈ పాటను నార్త్ ఇండియాలోని పలు లొకేషన్స్ లో చిత్రీకరిస్తారట. ఈ మూవీలో శింబు బోర్డర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. ‘అలై, విన్నతాండి వరువాయా’ తర్వాత శింబు, త్రిష కలయికలో వస్తున్న మూడవ సినిమా ఇది. ‘థగ్ లైఫ్’ ఓ పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా. 35 ఏళ్ళ తర్వాత కమల్, మణిరత్నం కలయికలో వస్తున్న మూవీ. ఈ సినిమాను డిసెంబర్ లో కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ రిలీజ్ చేయనున్నారు.