Bandla Ganesh: తెలుగు చిత్రపరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా, ముఖ్యంగా తన కమేడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఓవైపు పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా, మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై తన అభిమానం వ్యక్తం చేస్తూ తరచూ ప్రచురాల్లో ఉంటూ వస్తున్నారు.
చంద్రబాబుతో ఆత్మీయ భేటీ
తాజాగా బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రత్యక్షంగా కలిసారు. వారిద్దరి మధ్య జరిగిన ఆత్మీయ ఆలింగనం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది. బండ్ల గణేష్ ముఖంలో కనిపించిన ఆనందం, కృతజ్ఞత ఆయన మనసులో ఉన్న గాఢమైన అభిమానం స్పష్టంగా చూపిస్తోంది.
ఏడేళ్ల సమస్యకు చంద్రబాబు రెండు రోజుల్లో పరిష్కారం!
ఇటీవలి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకల్లో గణేష్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. ‘‘ఏడేళ్లుగా నాకు అంతుచిక్కని సమస్యకు రెండు రోజుల్లోనే పరిష్కారం లభించింది. అది చంద్రబాబుగారి వల్లే సాధ్యమైంది,’’ అంటూ ఆయన భావోద్వేగంతో స్పందించారు.
అంతేకాకుండా, ఆ సమస్యకు ముందు ఓ వ్యక్తి తనకు సహాయం చేస్తానని మాటిచ్చి చివరికి హ్యాండ్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, తన భార్య సలహా మేరకు చంద్రబాబుని కలవాల్సిన నిర్ణయాన్ని తీసుకున్నానన్నారు. రాజగోపాల్ అన్నద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుని, ఆయనను బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్ద కలిసినప్పుడు ఆయన చొరవతో సంబంధిత అధికారుల వద్దకు పంపించి సమస్యను వేగంగా పరిష్కరించారంటూ చెప్పారు.
చంద్రబాబుపై గణేష్ వీరాభిమానం
చంద్రబాబు నాయుడుపై బండ్ల గణేష్ చూపుతున్న అభిమానానికి కోలిచిన ఉదాహరణలు లేవు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలో ఆయన చేసిన ప్రసంగం పలు వేదికల్లో చర్చనీయాంశమైంది. అదీ కాక, ఇటీవల జరిగిన 75వ పుట్టినరోజు వేడుకల్లో “ఇది దేవుడు పుట్టినరోజు” అని వ్యాఖ్యానించడం గణేష్ భక్తిభావాన్ని గట్టిగా వ్యక్తీకరించింది. ఆయన మాటల్లోనే – “సంక్రాంతి, దీపావళికంటే పవిత్రమైన పండుగ చంద్రబాబు పుట్టినరోజు” అని అన్నారు.
రాజకీయాలకు దూరం అన్నా… మళ్లీ చేరికేనా?
ఒకదశలో రాజకీయాల నుంచి దూరమవుతానని ప్రకటించిన గణేష్… మళ్లీ నాయకుల కలయికల్లో, అభిప్రాయాల ప్రకటనల్లో బిజీగా మారారు. ఇది ఆయన రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టే సూచనగా భావించాల్సిందేనా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
థ్యాంక్ యు అమ్మ ❤️🙏 https://t.co/V0sCQ9QYOH
— BANDLA GANESH. (@ganeshbandla) May 16, 2025

