IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మే 17 నుండి మళ్ళీ ప్రారంభం కానుంది. అంతకుముందు పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా IPLను ఒక వారం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం.. కొంత మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువేనని చెప్పొచ్చు. వారిలో ఒకరు ఇంగ్లాండ్‌కు చెందిన విల్ జాక్స్. వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం విల్ జాక్స్ సిద్ధమవుతున్నాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. విల్ జాక్స్ స్థానంలో మరో హిట్‌మ్యాన్‌ను తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ రెడీ అవుతుంది. ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టోను తీసుకోవాలని ఎంఐ ప్లాన్ చేస్తోంది. బెయిర్‌స్టో, ఫ్రాంచైజీ మధ్య ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బెయిర్‌స్టో ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి 14 పాయింట్లు సాధించింది.
Also Read: IPL 2025: పాకిస్తాన్ సూపర్ లీగ్ వదిలి వెళ్లిపోతున్నా విదేశీ ఆటగాళ్లు
IPL 2025: నిజానికి ముంబై ఇండియన్స్ లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు జట్టుకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకునే సమీకరణం ఈ రెండు మ్యాచ్‌లపైనే ఆధారపడి ఉంది. అలాగే విల్ జాక్స్ ఈ రెండు లీగ్ మ్యాచ్‌లకు ముంబై జట్టు తరపున అందుబాటులో ఉంటాడు. అయితే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరితే విల్ జాక్స్ అప్పుడు అందుబాటులో ఉండడు. ఈ సమయంలో జానీ బెయిర్‌స్టో ఆ మ్యాచ్‌లకు జాక్స్ స్థానంలో ఉంటాడు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో జానీ బెయిర్‌స్టో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.