Dogs Attack:క్రెడిట్ కార్డు వాడేసుకున్నాడు.. బిల్లు సమయానికి కట్టలేకపోయాడు.. ఏమీ చేయలేరులే అనుకున్నాడో.. వస్తే చస్తారులే.. అని బెదిరించొచ్చు అని భావించాడో ఏమో కానీ, ఏకంగా రూ.2 లక్షల క్రెడిట్ కార్డు అప్పు తీర్చకుండా మిన్నకున్నాడు. ఫోన్లలో అడిగి అడిగీ విసిగి వేసారిన ఆ సంస్థ.. ఆ క్రెడిట్ కార్డు హోల్డర్ వద్దకు ఏజెంట్‌ను పంపించింది. ఆ ఏజెంట్ వచ్చీరాగానే మనోడు చేసిన పనికి బెంబేలెత్తిపోవాల్సి వచ్చింది.
Dogs Attack:హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి… జవహర్‌నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు చెల్లించాల్సి ఉన్నది. అయితే రికవరీ చేయడానికి అతని ఇంటికి ఏజెంట్ సత్యనారాయణ వచ్చాడు. ఈ సమయంలో అతను వచ్చీరాగానే క్రెడిట్ కార్డు హోల్డర్.. తన ఇంటి కుక్కను సత్యనారాయణ మీదికి వదిలాడు.
Dogs Attack:ఈ సమయంలో కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు లంకించుకోవాల్సి వచ్చింది. అయినా ఆ కుక్క వదలకుండా ఏజెంట్ సత్యనారాయణపై ఒక్కసారిగా మీదపడి కరిచింది. దీంతో బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.