Singham Again Vs Bhool Bhulaiyaa 3: దీపావళికి బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు రాబోతున్నాయి. అవే ‘సింగ్ ఎగైన్’, ‘భూల్ భూలయ్య3’. నవంబర్ 1న విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కారణం స్క్రీన్ షేరింగ్ ఇష్యూనే. రెండు వేరు వేరు జానర్స్ సినిమాలు. ‘సింగమ్ ఎగైన్’ యాక్షన్ ఎంటర్ టైనర్ కాగా, ‘భూల్ భూలయ్యా3’ కామెడీ హారర్ చిత్రం. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ‘భూల్ భూలయ్యా2’ని టీసీరీస్ నిర్మిస్తోంది. కార్తీక్అయాన్, విద్యాబాన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రి నటించిన ఈ చిత్రం 150 కోట్లతో నిర్మితమైంది.
ఇది కూడా చదవండి: Annu Kapoor: ముద్దంటే వద్దన్న ప్రియాంక..?
Singham Again Vs Bhool Bhulaiyaa 3: ఇక ‘సింగం ఎగైన్’ను రోహిత్ శెట్టి స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగన్ తో కలసి నిర్మిస్తున్నాడు. అజయ్ దేవగన్, కరీనాకపూర్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికాపడుకోనె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ షాఫ్ర్ తో పాటు షారూఖ్ అతిథిగా కనిపిస్తాడట. 375 కోట్ల వ్యయంతో నిర్మితమైందీ చిత్రం. దీంతో 60-40 బేసిస్ లో స్క్రీన్ షేరింగ్ కోరుకుంటున్నాడు రోహిత్ శెట్టి. అయితే టీసీరీస్ అందుకు ఒప్పుకోవడం లేదు. 50-50 బేసిస్ మీద కేటాయించాలని కోరుతోంది. సింగిల్ స్రీన్స్ లో ఈ రగడ ఇంకా ఎక్కువగా ఉంది. ఎవరికి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంటే వారికి ఎక్కువ థియేటల్లు దొరికే అవకాశం ఉంది. మరి ఈ సమస్యను రెండు సినిమాల టీమ్స్ ఎలా పరిష్కరించుకుంటాయో చూడాలి.