Virgin Boys: ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజై యూత్‌లో సంచలనం సృష్టిస్తోంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల్, సుజిత్ కుమార్, అభిలాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం యూత్‌ఫుల్ వైబ్స్‌తో ఆకట్టుకుంటోంది. టీజర్‌లో రంగుల విజువల్స్, స్మరణ్ సాయి సంగీతం, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా మలిచింది. గీతానంద్-మిత్రా శర్మ కెమిస్ట్రీ, శ్రీహాన్ కామెడీ టైమింగ్ ఆకర్షణీయంగా ఉన్నాయి. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను చూపించే ఈ కథ యూత్‌ను ఖచ్చితంగా థియేటర్స్‌కు రప్పించగలదని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
