RAPO22: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తనదైన స్టైల్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మాస్ సినిమాలతో ఊరమాస్ చేసిన రామ్, ఇప్పుడు తన 22వ చిత్రంతో క్లాస్ జోనర్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకుడు మహేష్ బాబుతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. తాజాగా, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
Also Read: Sriya Reddy: ఓజి’ సెట్స్‌లో సందడి: ‘సలార్’ బ్యూటీ ఎంట్రీ?
RAPO22: మే 15 అనగా రేపు ఉదయం 10:08 గంటలకు టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను రివీల్ చేయనున్నారు. ఈ టైటిల్ ఏమిటన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది, మెర్విన్ సోలోమోన్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, రామ్ ఫ్యాన్స్‌కు కొత్త అనుభవాన్ని అందించనుంది. రేపటి అప్డేట్ కోసం రామ్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Coming to celebrate a million emotions with the BIOPIC OF A FAN ❤️🔥#RAPO22TitleGlimpse drops on May 15th at 10.08 AM 💥#RAPO22@ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @siddnunidop @sreekar_prasad @artkolla… pic.twitter.com/Q8m2dTx4O1
— Mythri Movie Makers (@MythriOfficial) May 14, 2025