TDP: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ సభ్యుత్వ కార్యక్రమము ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని జిల్లా టిడిపి కార్యాలయంలో మంత్రి టీజీ భరత్, జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ అభివృద్ధి లక్ష్యంగా కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఈ సభ్యత కార్యక్రమం ఉంటుందని టీజీ భరత్ అన్నారు. నామినేటెడ్ పోస్టులో సభ్యత్వం అనేది చాలా కీలకంగా మారుతుందని తెలిపారు. అలాగే కార్యకర్తలు ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే పార్టీ తరఫున కూడా భరోసా కల్పించేందుకే ఈ సభ్యత నమోదు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ఎంపి బస్టిపటి నాగరాజు , జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సభ్యత కార్యక్రమంలో పేరు నమోదు చేయించుకున్నారు. కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, కార్పొరేటర్ కైప పద్మాలత రెడ్డి, విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి శాశ్వత సభ్యత్వ కోసం ఒక్కొకరు లక్ష రూపాయలు కట్టి చేయించుకున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా పార్టీ సభ్యత్వంలో కార్యకర్తలు నాయకులు కీలకంగా ఉండాలని తెలిపారు.
