Mavoist: మావోయిస్టుల ఘాతుకం – నలుగురు గ్రామస్తుల హత్య

Mavoist: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి మానవత్వాన్ని మంట కలిపారు. స్థానికంగా ఇన్‌ఫార్మర్లు (గూఢచారులు) అన్న నెపంతో నలుగురు గ్రామస్తులను హత్య చేశారు. ఈ ఘటన మావోయిస్టుల ఆచరణపై మరోసారి ఆగ్రహాన్ని రేపుతోంది.

మృతులు లింగాపురం, కంచాల, మినగట్ట గ్రామాలకు చెందినవారని అధికారులు తెలిపారు. మావోయిస్టుల దాడి కారణంగా ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. హత్య జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించే అవకాశం ఉండగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతపై మరోసారి ప్రశ్నలు రేగుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *