Eatala Rajendar: బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శామీర్‌పేట సమీపంలోని ఆయన ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో అలర్ట్ అయిన పోలీసులు ఈటల రాజేందర్ ఇంటి వైపు వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసి ఉంచారు. ఈ దశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Eatala Rajendar: నిన్న (మే 11) సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనను తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు రాష్ట్ర ప్రజలను ఏడిపిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి పిచ్చివేశాలు మానుకోవాలని హెచ్చరించారు. ఎంపీ ఈటల వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్వరంతో మండిపడ్డారు. దీంతోపాటు యూత్ కాంగ్రెస్ నాయకుల పిలుపుపై ఆందోళన నెలకొన్నది.
Eatala Rajendar: ఈ దశలో ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు (మే 12న) కూడా స్పందించారు. కలెక్టరేట్లు, కార్యాలయాలను ముట్టడిస్తారని, ఇండ్లను ఎవరైనా ముట్టడిస్తారా? అని వారిని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉన్నదా? అని నిలదీశారు. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కేసులకు భయపడేది లేదని, అధికారం లేనప్పుడే కొట్లాడిన పార్టీ బీజేపీ అని తేల్చి చెప్పారు.

